అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని డీఈఓ ద్వారా అన్ని పాఠశాలల హెచ్ఎం లకు ఎంఈవోలు చేరవేయాలని సమాచారం ఇచ్చారు. వరద ప్రభావం ఎక్కువ కావడంతో పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ కూడా రద్దు చేశారు.
