కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు,మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికత శోభతో కనిపించాయి. ఆలయంలో హోమం కూడా నిర్వహించారు.









