కాకినాడ జిల్లా గొల్లప్రోలు శ్రీరామ్ విద్యానికేతన్ స్కూల్ లో జనసేన పార్టీ వీర మహిళా వినుకొండ శిరీష ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరిగింది. టెక్నిక్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 200 మంది డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరవ్వగా, కొంతమందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
