కాకినాడ పట్టణంలోని కల్పనా సెంటర్లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు మోటార్ సైకిల్ బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు తిరగబడి ఉండడంతో ఘటన ప్రాంతం భయానకంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు
