కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొంతంగి గ్రామంలో శ్రీ సంజన ట్రేడర్స్ లో సుమారు 7 లక్షల రూపాయుల విలువైన జీడిపప్పును గుర్తు తెలియని దుండగులు చోరి చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. కొంతంగి గ్రామానికి చెందిన కుక్కా వెంకట కృష్ణంరాజు జీడి పిక్కల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. నిర్వహిస్తున్నాడు. గోడౌన్‌లో ఉంచిన జీడిపప్పు దొంగతనానికి గురైనట్లు బాధితుడు చెబుతున్నాడు. అన్నవరం ఎస్సై కిశోర్ దర్యాప్తు చేస్తున్నారు.
