ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో కోటగుమ్మం సెంటర్లో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాసం సందర్భంగా శ్రీ వాసవి అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాఖంబరిగా అలంకరణ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, అనంతరం భక్తులకు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చేలా ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పిఠాపురం పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, వాసవి కపుల్స్ క్లబ్ సభ్యులు ఏర్పాట్లు చూస్తున్నారు.
