కాకినాడ జిల్లాలోని పుణ్యక్షేత్రం పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ ఆలయం ఎంతో విశిష్టత కలది. తెలుగు రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర , ఒడిస్సా నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. పిఠాపురంలో ఉన్న పాద గయ క్షేత్రంలో స్వయంభు దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా గురు పౌర్ణమి ఘనంగా జరుగుతుంది
