భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలల యాజమన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కాకినాడ జిల్లా లోని అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాల సెలవు విషయాన్ని తెలిపారు.
అక్కడ నుండి వారు, హెచ్ ఎమ్‌లకు సమాచారాన్ని అందించారు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పరిధిలోని అన్ని యాజమాన్య ప్రధానోపాధ్యాయులుకు ఈ సమాచారమును తెలియజేయ వలసినదిగా తెలిపారు. సెలవు ప్రకటించడంతో పాటు, పలు విషయాలపై దృష్టి పెట్టాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం నుండి సూచనలు వెలువడ్డాయి.
- వర్షాల కారణంగా బురదనీటి వలన నీటి నుండి వచ్చే చెత్త వలన పాటశాల పరిసరాలు పాడై పోవు పరిస్థితి ఉన్నందున వెంటనే సదరు పాటశాల పరిసరాలు పరిశుభ్ర పరచుటకు సత్వర చర్యలు తీసుకోవాలి.
- పాఠశాల భవనముల దృఢత్వం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- శిధిలావస్థలో ఉన్న మరియు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కలిగియున్నటువంటి భవనాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించ రాదు.
- 4. ప్రస్తుత శెలవు దినములకు తదుపరి వచ్చే ప్రభుత్వ శెలవు దినములలో సదరు పాఠశాలలు కంపెన్షటరీ గా పనిచేయవలసి ఉంటుంది.