దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయలో ఆరో తరగతిలో విద్యార్థులు ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వసతి, భోజనంతోపాటు ఉచిత విద్యను అందిస్తారు. కో-ఎడ్యుకేషన్ విధానంలో బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా విద్యాలయాలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు, లేదా ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివుతున్న విద్యార్థులు ఈ అర్హత పరీక్షకు అర్హులు. ఎస్ ఐ ఓస్ నుండి సెప్టెంబర్ 15, 2024 నాటికి బి-సర్టిఫికెట్ కాంపిటెన్సీ కోర్సు చేసిన వారు కూడా పరీక్ష రాసేందుకు అర్హులు.
విద్యార్థులు మే 1, 2013 నుండి జూలై 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. జేఎన్వీ సెలక్షన్ విధానంలో అబ్జెక్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 2 గంటలు సమయం ఉంటుంది. మొత్తం మార్కులు 100. మూడు విభాగాలుగా 80 మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అర్థమెటిక్, లాంగ్వెజ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ మీద ప్రశ్నలు ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు. బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ ఉపయోగించాలి. ఓఎమ్ఆర్ షీట్ విధానంలో పరీక్ష ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్థూ, కన్నడ, ఒరియా భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఆఖరు తేది – సెప్టెంబర్ 16, 2024
పరీక్ష తేదిలు – జనవరి 2025, నుండి ఏప్రియల్ 12, 2025 వరకూ
వెబ్సైట్ వివరాలు – www.navodaya.gov.in