చెన్నైలోని సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో కార్తీ నటిస్తున్న ‘సర్దార్-2’ షూటింగ్‌లో తాజాగా ప్రమాదం జరిగింది. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫైటింగ్ ట్రైనర్ యెుమ్మలై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. బాగా ఎత్తు నుంచి కిందపడటం, ఛాతీపై గాయాలు, ఊపిరితిత్తులలో రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విరుగంపాక్కం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
