Search
Close this search box.

  గేమ్ చేంజర్ మరో లీక్..!

ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఇండస్ట్రీ లీకులను ఆపలేకపోతుంది. ఎంత పెద్ద సినిమా అయినా ఈ లీకురాయుళ్ల చేతిలో పడుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమా షూట్ జరుగుతుంది అంటే.. అక్కడకు వెళ్లి.. ఎవరికి తెలియకుండా ఫోన్ లో వీడియోలు తీసి.. లైక్స్ కోసం, షేర్స్ కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీన్ని మేకర్స్ సైతం నియంత్రించలేకపోతున్నారు.

 

కల్కి సమయంలో ఇలా జరిగితే వైజయంతి మూవీస్ బ్యానర్ మేకర్స్ చాలా సీరియస్ అయిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ఈ లీకురాయుళ్లు.. గేమ్ ఛేంజర్ మీద పడ్డారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నాడని, తండ్రీకొడుకులగా నటిస్తున్నాడని లీకుల ద్వారానే తెలిసింది. ఇక రెండు పాత్రల లుక్స్ కూడా లీక్ ఫోటోల ద్వారానే తెలిసింది. కియారా లుక్, అంజలి లుక్.. ఇలా ఒకటేమిటి.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ లీక్ అవ్వడం వలనే ప్రేక్షకులకు తెలుస్తోంది.

 

అంతెందుకు జరగండి.. జరగండి సాంగ్ కూడా ముందు లీక్ అయ్యాకానే.. మేకర్స్ ఒరిజినల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో సీన్ ను లీకురాయుళ్లు లీక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఒక ఎయిర్ పోర్ట్ సీన్ షూట్ చేస్తుండగా.. ఆ సీన్ మొత్తాన్ని కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్.. ఒక పొలిటికల్ లీడర్ కు వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

 

బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో చరణ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్నీ చూసిన అభిమానులు ఒరేయ్.. సినిమా మొత్తం సోషల్ మీడియాలోనే చూపించేస్తున్నారు కదరా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు