ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.
ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈరోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశముంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని తెలుస్తోంది.