Search
Close this search box.

  చెత్త‌తో కోట్ల సంప‌ద సృష్టిద్దాం..నేనే పూనుకుంటున్న : అధికారుల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చెత్త‌తో కోట్ల సంప‌ద సృష్టిద్దాం..నేనే పూనుకుంటున్న : అధికారుల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చెత్త‌తో కోట్ల సంప‌ద సృష్టిద్దాం..నేనే పూనుకుంటున్న : అధికారుల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చ’ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఘన వ్యర్థాలను 12 గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుంది… వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలి అన్నారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే ఏడాదికి రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతోపాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. వస్తువులు వినియోగించడం, విసిరేయడం తప్ప క్లీనింగ్ తో సంబంధం లేదనే భావన  మనందరిలోఉందని, ఆ భావన మార్చకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఎస్.ఎల్.ఆర్.ఎం.) ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టూ గోల్డ్ పేరుతో శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించారు.

ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు, ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్ పాల్గొన్నారు.

చెత్త‌తో కోట్ల సంప‌ద సృష్టిద్దాం..నేనే పూనుకుంటున్న : అధికారుల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మన దైనందిక జీవితంలో చెత్త ఒక భాగమైపోయింది. దానిని మన జీవితాల నుంచి వేరు చేయలేం. ఇలాంటి ప్రదర్శనలు కొత్తేమీ కాదు. ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేసి ఉంటాయి. మా ప్రభుత్వం హయాంలో మాత్రం బలంగా దీనిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.

పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురం

మన దేశం సంసృతి, సంప్రదాయాలకు విలువిచ్చే దేశం. పంచభూతాలను దేవుళ్లుగా భావిస్తాం. చిన్నపాటి నీటి వనరు కనిపిస్తే గంగా జలంగా భావించి పూజలు చేస్తాం. దురదృష్టవశాత్తు మనమంతా పూజలు, పునస్కారాలకు మాత్రమే పరిమితమయ్యాం తప్ప జల వనరులను పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమయ్యాం. భీమవరంలో యనమదుర్రు డ్రైన్ ను డంపింగ్ యార్డుగా మార్చేశారు.

చెత్త‌తో కోట్ల సంప‌ద సృష్టిద్దాం..నేనే పూనుకుంటున్న : అధికారుల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వర్షాకాలంలో ఆ వ్యర్థాలు పంట కాలువలో కలిసిపోయి నీరు కలుషి తమవుతోంది. ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీద ఇష్టానుసారం పడేయడం వల్ల వాటిని ఆహారం అనుకొని తప్పుగా భావించి పశువులు ప్రాణాలు కోల్పో తున్నాయి. ఒకవైపు గోపూజ, గో రక్షణ అంటూనే వాటి మరణానికి మనం బాధ్యులు అవుతున్నాం. ముందుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు