ధవలేశ్వరం ఆనకట్ట వద్ద దిగువకు విడుదల చేస్తున్న క్యూసెక్కుల వరదనీటి ప్రవాహ ప్రకారం కోనసీమ జిల్లాలో గోదావరి వరదల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొ నేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు వరదలు విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వరదలను ఎదుర్కొ నేందుకు రూపొందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు.అదేవిధంగా 2022 ఏడాదిలో గోదావరి నదికి వచ్చిన వరదలను ఎదుర్కొనడంలో చేపట్టిన సహాయ పునరావాస చర్యల పైన ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం వరద హెచ్చరికలు కనుగుణంగా ఏ ఏ లంక గ్రామాలు ఆవాసాలు ముంపు బారిన పడతాయో ఆ ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలకు నిర్వహణకు ఉపక్రమించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి వారు ముంపు ప్రభావిత గ్రామాలలో వరద హెచ్చరికలు కనుగుణంగా పంచాయతీ సిబ్బంది ద్వారా టామ్ టామ్ వేయించి ముంపు బాధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో సురక్షిత త్రాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. కొవ్వొత్తులు గ్యాస్ లైట్లు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై చర్యలు గైకొనాలన్నారు.
ఈ సహాయక చర్యలు సులభతరంగా అమలు చేసేందుకు మ్యాపింగ్ ప్రక్రియ చేయాలని ఆదేశించారు.గోదావరి హెడ్ వర్క్స్ ఇంజనీర్లు వర్షపాతం, గోదావరి నది వరద ప్రవాహం పై సింపుల్ ఫార్మేట్ లో రోజువారి వివరాలు నింపి సిపిఓ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారికి నివేదిక సమర్పిం చాలని ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర విపత్తుల నిర్వహణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల విపత్తు హెచ్చరికలు ముందస్తు సూచనలను కూడా సిపిఓ పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యశాఖ గజ ఈతగాళ్లను సహాయక చర్యల కొరకు మోటార్ మేకనైజ్డ్ బోట్లను ఆయిల్ ఇంజన్ బోట్లను సిద్ధం చేయాలన్నారు.పెర్రిసు ఫంట్స్ ఆపరేషన్ సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారం నిర్వహించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వరద గ్రామాలలో మరియు పునరావస కేంద్రాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు గ్రామాలలో మంచానికే పరిమిత మైన వ్యాధిగ్రస్తులు, గర్భిణీల ప్రసవ తేదీలను బట్టి ముందస్తుగా సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. అన్ని రకాల ఔషధాలు ముందు గా సిద్ధం చేసుకోవాలని ఆరోగ్య కేంద్రాలలో విద్యుత్తుకు ప్రత్యేకమైన జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అత్యవసర వైద్య సేవలు కొరకు వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా నీటి యజమాన్య సంస్థ స్వచ్ఛందంగా మానవ వనరులను సహాయక సేవల కొరకు నియమించాలన్నారు. పశుసంవర్ధక శాఖ లంక గ్రామాలలో పశువులను సమీప మెట్ట ప్రాంతా లకు తరలించి పశుగ్రాసందానాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందిస్తూ, టేక్ హోమ్ రేషన్ కూడా సరఫరా చేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కమ్యూనిటీ మేనేజ్మెంట్ ప్లాన్ తో అవగాహన కార్యక్రమాలు గ్రామ సమాఖ్య ద్వారా నిర్వహించి అప్రమత్తం చేయాలన్నారు.పునరావాస కేంద్రాలలో స్వయం సహాయక సంఘాల మహిళలు వంటావార్పు విషయంలో సహకారం అందించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ముంపు గ్రామాలలో సురక్షిత త్రాగునీరు ట్యాంకర్లు క్యాన్లు ప్యాకెట్లు ద్వారా అందించాలని సూచించారు సామాజిక రక్షిత త్రాగునీటి స్కీముల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ముంపు గ్రామాలలో పాఠశాలలకు వరద ఉన్న సమయంలో సెలవులు ప్రకటించాలని సూచించారు జిల్లా పౌరసరఫరాల అధికారులు ముంపు ప్రభావిత గ్రామాలలో ఉన్న 94 చౌక్ ధరల దుకాణాలలో నిత్యావసరాలు ఎక్కువ మోతాదులో నిలువ చేయాలని ఆదేశించారు. రహదారులు భవనాల శాఖ పవర్ రంపాలు జెసిబి లు రాడ్ల క్లియరెన్స్ కొరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ గ్రామాలలో విలేజ్ కల్వర్టులు పవర్ కట్టర్స్ జెసిబి లు సిద్ధం చేసుకుని పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వరదలు అనంతరం రోడ్ల రిపేర్లు చేపట్టాలన్నారు అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగం సహా యక చర్యల నిమిత్తం ఆస్కా లైట్లు మెన్ మెటీరియల్ ను సమకూర్చుకోవాలన్నారు.జల వనరుల శాఖ ఇంజనీర్లు ఏటిగట్లు బలహీ నంగా ఉన్నచోట పథకాలకు రక్షణ చర్యల కొరకు ఇసుక బస్తాలు తదితర సామాగ్రి సమకూర్చుకోవాలన్నారు.ఏపీ ట్రాన్స్కో వారు విద్యుత్ పునరుద్ధరణ కొరకు మెటీ రియల్ మానవ వనరులు సిద్ధం చేసుకోవాలన్నారు. గోదావరి వరదలు విపత్తుల సహాయక చర్యల కొరకు జిల్లా ప్రధాన కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ 08856-293104 ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు వరదలు వర్షపాతం హెచ్చరికలు కనుగుణంగా ఆయా స్థాయిలలో సహాయక చర్యలను చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు ఎస్ సుధాసాగర్,జి కేశవర్ధన రెడ్డి, జెవివి సత్యనారా యణ, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.