Search
Close this search box.

  వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్‌..!

వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ‌తంలో త‌న ఇంట్లో ప‌నిచేసే బాలికపై లైంగిక‌ వేధింపులకు పాల్ప‌డ‌గా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి త‌ర‌లించారు.

జరదొడ్డి సుధాకర్‌ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కు టికెట్ దక్కింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు