జనసేనాని పవన్ రాజకీయ కార్యదర్శి గా ఉన్న పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు.రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం హరిప్రసాద్ జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబును కలుసుకున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్ మాట్లాడుతూ “పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని దీనిపై తనకు ఇచ్చిన అవకాశం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు. ఇప్పటి వరకు పాత్రికేయుడిగా ఆ సమస్యల పరిష్కారానికి పరోక్షంగా కృషి చేశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించిందని హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, వారికి మేలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచిన జనసేనాని పవన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.