రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ మాటలు అప్పట్లో కలకలరం రేపాయి. అయితే ఆయన అన్న మాటలకు తగ్గట్టుగానే భీమవరానికి చెందిన ఓ కేసుపై పట్టుబిగించిన పవన్‌కు అదృశ్యమైన యువతి వివరాలను పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకి కనుగోన్నారు. కేవలం తమ బిడ్డ పవన్ కళ్యాణ్ వల్లే దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందనిక ఆమె తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆతర్వాత కాలంలో పవన్ వద్దకు సమస్యను తీసుకెళ్లడంతో కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టగానే సమస్య పరిష్కరిస్తామని వారికి పవన్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే సమస్యను పవన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పోలీసులు అదృశ్యమైన యువతి జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ యువతి విషయంపై విజయవాడ పోలీసు కమిషనర్ తో మాట్లాడారు. యువతి ఆచూకి లభ్యమైందని చెప్పడంతో పవన్ పోలీసు అధికారులను అభినందించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ఈవిషయాన్ని మీడియాకు వివరించారు. తమ బిడ్డ కనిపించకపోతే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసి విచారణ వేగంగా మొదలుపెడితే ప్రయోజనం ఉంటుందన్నారు. యువతులను లవ్ ట్రాప్ చేసి ఈ విధమైన నేరాలు చేస్తున్నారని పవన్ అన్నారు. అలా చేసేవారి పట్ల ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు.