బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ అవేమి అతడికి అంత స్టార్డమ్ అందియ్యలేదు. అనంతరం ‘అల్లుడు అదుర్స్’తో మరొక హిట్ అందుకున్నాడు. ఇక అక్కడ నుంచి ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాడు. కానీ అందులో ఒక్క సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పలేకపోయింది.
ఇక టాలీవుడ్లో అదృష్టం లేకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేశాడు. అక్కడ ఛత్రపతి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెల్లంకొండ కెరీర్‌కు మంచి కంబ్యాక్ అవుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమా ఫ్లాప్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ టాలీవుడ్లోకి వచ్చేశాడు.
ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస సినిమాలను లైన్ పెట్టాడు. ఈ సారి ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడి లైనప్‌లో ‘టైసన్ నాయుడు’ ఒకటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
‘రాక్షసుడు’ సినిమాలో కలిసి నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘చావు కబురు చల్లగా’ సినిమా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్లో కొత్త సినిమాను ప్రకటించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8లో తెరకెక్కుతోంది. #BSS11 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ ఈ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది.
హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 11 నుంచి స్టార్ట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.