Search
Close this search box.

  ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..!

July 2, 2024 1:07 PM | Aditya369 News

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది.

దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మూడు నెలలకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ… రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది.

దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మూడు నెలలకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు