మంత్రి సీతక్కకు హోంశాఖ పదవి వచ్చే అవకాశముందని, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖలకు మార్పులు చేర్పులు చేసే అవకాశముందన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశముందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కవచ్చునన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన చేస్తామన్నారు.