Search
Close this search box.

  2027 సమ్మర్ టార్గెట్‌గా బాలయ్య – కొరటాల మూవీ..?

May 26, 2026 11:17 PM | Aditya369 News

2027 సమ్మర్ టార్గెట్‌గా బాలయ్య – కొరటాల మూవీ..?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘NBK111’ షూటింగ్‌లో పాల్గొంటున్న బాలయ్య.. త్వరలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మరో పవర్‌ఫుల్ సినిమాకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో కూడిన హై వోల్టేజ్ మాస్ డ్రామాగా రానుందట. ఇటీవలే బాలయ్యపై ప్రత్యేక లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి.. దసరా కానుకగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడనే వార్త కూడా అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘NBK112’ వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాను 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే.. కొరటాల శివ సినిమా లైన్లోకి రావడంతో బాలయ్య తన తదుపరి ప్రాజెక్టుల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయాల్సిన సినిమా తాత్కాలికంగా హోల్డ్‌లో పడిందని సమాచారం. ఈ కాంబినేషన్ మూవీ ఇప్పుడు 2027 చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బాలయ్య – కొరటాల శివ కాంబో మాత్రం ఇప్పటి నుంచే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore