Search
Close this search box.

  కాకినాడలో జూలై 1న జాబ్ మేళా

 ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు

వికాస ఆధ్వర్యంలో జూలై 01వ తేదీ సోమవారం వికాస కార్యాలయం కాకినాడ కలెక్టరేట్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాసా ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్మేళాలో భవి క్రియేషన్స్ ప్రై॥లి॥ కంపెనీలో సోషల్ మీడియా మేనేజర్, సిఇఒ, వీడియో ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, కాళీస్వరీ రిఫైనరీ & ఇండస్ట్రీ ప్రై॥లి॥లో టెక్నిషియన్, శ్రీ గోపాల్ ఆటోమోటివ్ లి||లో సేల్స్ రిప్రెజెంటేటివ్, అసిస్టెంట్ మేనేజర్, బాలాజీ కెపిటల్లో ఫైనాన్షియల్ అడ్వయిజర్, టెలీకాలర్స్, డేటా సోర్సింగ్ ఆఫీసర్, యాక్సిస్ బ్యాంక్ బిడిఇ, డెక్కన్ కెమికల్స్ ట్రైనీ ప్రొడక్షన్, కో-జెంట్ ఈ సర్వీసెస్ కంపెనీలో బిపిఒ (తెలుగు, ఇంగ్లీషు), రాక్మెన్ ఇండస్ట్రీస్ లి॥లో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, డిగ్రీ & ఎంబిఎ ఉత్తీర్ణులైన 35 సం||లోపు అభ్యర్థులు అర్హులు. వీరికి నెలకు రూ.12,000/- నుండి రూ.20,000/- వరకు జీతం+ఇన్సింటివ్స్, భోజనం, వసతి మ‌రియు రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులందరూ జూలై 01వ తేదీ సోమవారం “వికాస కార్యాలయం, కలెక్టరేట్, కాకినాడ” వద్ద ఉదయం 9 గం॥లకు సర్టిఫికెట్స్ జెరాక్స్ ల‌తో హాజరువాల‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు