Search
Close this search box.

  ఆస్కార్ రేసులో రామాయణ..?

November 25, 2026 11:13 PM | Aditya369 News

ఆస్కార్ రేసులో రామాయణ..?

బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి భారీ వసూళ్లతో దూసుకుపోతోందని సమాచారం. అంతేకాదు, ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా చోటు దక్కించుకోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

తాజా సమాచారం ప్రకారం, 99వ అకాడమీ అవార్డుల విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి సంబంధించిన టాప్ 20 జాబితాలో ‘రామాయణ’కు స్థానం లభించిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా ప్రయాణిస్తోందని, 2000 కోట్ల మార్కును అందుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి కనిపించనుంది. రావణుడి పాత్రను యష్ పోషిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా, ఆయనకు చెందిన డీఎన్ఈజీ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహిస్తోంది. గతంలో ఈ సంస్థ పలు అంతర్జాతీయ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించి ఎనిమిది ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.

ఇక ‘రామాయణ’ రెండు భాగాల కోసం సుమారు 4000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. మొదటి భాగం తర్వాత రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మొత్తానికి బాక్సాఫీస్ వసూళ్లు, ఆస్కార్ రేసు.. ఇలా రెండు విషయాల్లోనూ ‘రామాయణ’ వార్తల్లో నిలుస్తోంది. మరి ఈ విజువల్ వండర్ చివరకు 2000 కోట్ల మార్కును అందుకుంటుందా? ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు