Search
Close this search box.

  ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! అనిల్ రావిపూడి అదిరిపోయే హింట్..!

November 25, 2026 11:12 PM | Aditya369 News

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! అనిల్ రావిపూడి అదిరిపోయే హింట్..!

వరుస విజయాలతో టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో పాల్గొన్న అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ముందుగా మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం ఎంతో ఆనందంగా ఉందని అనిల్ తెలిపాడు. గతంలో తన ‘ఎఫ్2’ సినిమాకు కూడా ఇలాంటి అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్లు, కలెక్షన్ల హడావిడిలో దర్శకుడిగా సినిమాను ప్రశాంతంగా చూసే అవకాశం ఉండదని, కానీ గోవాలో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తూ వారి నుంచి అద్భుతమైన స్పందన రావడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక చిరంజీవిని ఈ సినిమాలో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా చూపిస్తూనే, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే కామెడీ, డ్యాన్స్, ఎమోషన్స్‌ను అద్భుతంగా మిళితం చేశామని తెలిపాడు. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ బంధాల చుట్టూ అల్లుకున్న కథ చిరంజీవికి బాగా నచ్చిందని, ఆయనతో దాదాపు ఏడాది పాటు ప్రయాణం చేయడం మర్చిపోలేని అనుభవమని వెల్లడించాడు.

అలాగే ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ సినిమాల్లో చిరంజీవి చూపించిన కామెడీ టైమింగ్‌ను మరోసారి గుర్తుచేస్తూ, ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ కనిపిస్తుందని ప్రశంసించాడు. ఆయన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, మంచి మ్యూజిక్, సౌండ్ కుదిరితే చిరంజీవి తెరపై కనిపించగానే పాటకు కొత్త ఉత్సాహం వస్తుందని అనిల్ కొనియాడాడు.

మరోవైపు సంక్రాంతి సినిమాల పోటీ గురించి స్పందిస్తూ, తాను సినిమా తీస్తున్నానంటే ఇతర నిర్మాతలు భయపడుతున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. సంక్రాంతి అనేది టాలీవుడ్‌కు అతిపెద్ద సీజన్ అని, కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డాడు. తన సినిమాతో పాటు విడుదలయ్యే మిగతా చిత్రాలు కూడా విజయాలు సాధించాలని కోరుకుంటానని తెలిపాడు.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ సినిమాపై కూడా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత దిల్ రాజుతో ఒక సినిమా చేయాల్సి ఉందని, అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను మాత్రం ముందుగానే ప్రకటించామని చెప్పాడు. సినిమా జానర్ గురించి ఇప్పుడే వెల్లడించలేనని తెలిపిన అనిల్.. ఎన్టీఆర్‌ను కామెడీ పాత్రలో చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారని ఆసక్తికరమైన హింట్ ఇచ్చాడు.

దీంతో ఎన్టీఆర్‌ను తనదైన కామెడీ స్టైల్‌లో అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగిపోయింది. మరి ఈ కాంబినేషన్‌లో ఎలాంటి నవ్వులు పూయిస్తారో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు