కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవాడ గ్రామం పేరుచెబితే చాలు ఎన్నికల్లో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్‌గా చెబుతుంటారు. ఇక్కడ అదనపు బలగాలు మోహరించడం, అధికారులకు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏదో ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఊరంతా ఒక్కటైంది. ఏకగ్రీవం దిశగా వెళ్లింది. సర్పంచి, ఉపసర్పంచి, వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సర్పంచిగా కూరాకుల కృష్ణవేణి రాంబాబు, ఉప సర్పంచిగా బొజ్జా రామప్రసాద్‌లు ఏకగ్రీవం కాగా, మొత్తం 14 వార్డు సభ్యులు ఏకగ్రీవమైయ్యారు. ఊరు అభివృద్ది కోసం అంతా ఒకేతాటిపైకి వచ్చామని సర్పంచి ఆనందం వ్యక్తం చేశారు.









