Search
Close this search box.

  ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా..! నవ్వుల జాతరకు సిద్ధమవ్వండి..!

November 14, 2026 11:26 PM | Aditya369 News

ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా..! నవ్వుల జాతరకు సిద్ధమవ్వండి..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై శనివారం అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది.

సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్.. తమ కాంబినేషన్‌లో రాబోయే సినిమా నవ్వులతో సందడి చేయబోతోందని హింట్ ఇచ్చారు. 'This one's going to be a laugh riot' అంటూ ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. దీంతో ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే చర్చ మొదలైంది.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలంటే పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. మరోవైపు అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు యాక్షన్, మాస్ సినిమాలతో అలరించిన ఎన్టీఆర్.. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్‌లో ఎలా కనిపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి నవ్వుల విందు ఉండబోతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. సినిమా నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ వివరాలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై శనివారం అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది.

సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్.. తమ కాంబినేషన్‌లో రాబోయే సినిమా నవ్వులతో సందడి చేయబోతోందని హింట్ ఇచ్చారు. ‘This one’s going to be a laugh riot’ అంటూ ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. దీంతో ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే చర్చ మొదలైంది.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలంటే పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. మరోవైపు అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు యాక్షన్, మాస్ సినిమాలతో అలరించిన ఎన్టీఆర్.. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్‌లో ఎలా కనిపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి నవ్వుల విందు ఉండబోతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. సినిమా నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ వివరాలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore