Search
Close this search box.

  సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..! సినీ ప్రముఖుల సంతాపం..!

November 14, 2026 11:20 PM | Aditya369 News

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..! సినీ ప్రముఖుల సంతాపం..!

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

1946 జూన్ 8న ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నప్పటి నుంచే నాటకాలు, నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో విడుదలైన 'జగమే మాయ' సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో హీరోగా నటించినప్పటికీ, ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత గిరిబాబుకు ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 'కురుక్షేత్రం' సినిమాలో దుశ్శాసనుడి పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జ్యోతి, పసివాడి ప్రాణం, హలో బ్రదర్, సిసింద్రి, లిటిల్ సోల్జర్స్, నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, నువ్వే కావాలి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.

కేవలం సీనియర్ హీరోల సినిమాలకే పరిమితం కాకుండా, కొత్త తరం నటీనటులతోనూ కలిసి పనిచేశారు. మహేష్ బాబు నటించిన 'అతడు' సినిమాలో హీరోయిన్ తండ్రిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గమ్యం, అ ఆ, గీత గోవిందం, డిస్కో రాజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, జాతిరత్నాలు వంటి సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గిరిబాబు తన ప్రతిభను నిరూపించుకున్నారు. రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుతున్నా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మెరుపు దాడి, దేవతలారా దీవించండి తదితర చిత్రాలను నిర్మించారు. ఇలా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు తన వంతు సేవలందించారు.

గిరిబాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు బోసుబాబు కూడా గతంలో సినిమాల్లో నటించారు. ఆయన భార్య శ్రీదేవి 2018లోనే కన్నుమూశారు. ఇప్పుడు గిరిబాబు మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు ఇక లేరనే వార్త సినీ అభిమానులను కలచివేస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

1946 జూన్ 8న ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నప్పటి నుంచే నాటకాలు, నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో హీరోగా నటించినప్పటికీ, ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత గిరిబాబుకు ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ‘కురుక్షేత్రం’ సినిమాలో దుశ్శాసనుడి పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జ్యోతి, పసివాడి ప్రాణం, హలో బ్రదర్, సిసింద్రి, లిటిల్ సోల్జర్స్, నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, నువ్వే కావాలి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.

కేవలం సీనియర్ హీరోల సినిమాలకే పరిమితం కాకుండా, కొత్త తరం నటీనటులతోనూ కలిసి పనిచేశారు. మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గమ్యం, అ ఆ, గీత గోవిందం, డిస్కో రాజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, జాతిరత్నాలు వంటి సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గిరిబాబు తన ప్రతిభను నిరూపించుకున్నారు. రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుతున్నా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మెరుపు దాడి, దేవతలారా దీవించండి తదితర చిత్రాలను నిర్మించారు. ఇలా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు తన వంతు సేవలందించారు.

గిరిబాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు బోసుబాబు కూడా గతంలో సినిమాల్లో నటించారు. ఆయన భార్య శ్రీదేవి 2018లోనే కన్నుమూశారు. ఇప్పుడు గిరిబాబు మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు ఇక లేరనే వార్త సినీ అభిమానులను కలచివేస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore