సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు సంబంధించిన సమయం దగ్గరపడుతున్నప్పటికీ చిత్రబృందం నుంచి ఆశించిన స్థాయిలో అప్డేట్స్ రావడం లేదు.
గత ఏడాది నవంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ ఎంతో ఘనంగా విడుదల చేశారు. నవంబర్ 15న భారీ స్క్రీన్‌పై ఈ గ్లింప్స్‌ను లాంచ్ చేయడంతో అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.
ఇక ఈ నవంబర్‌లో మరో భారీ ట్రీట్ ఉండబోతుందంటూ గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలాంటి సమయంలో కనీసం ఒక చిన్న అప్డేట్ కూడా రాకపోవడంతో మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి గత ఏడాది నవంబర్‌లో భారీ ట్రీట్ ఇచ్చిన రాజమౌళి, ఈసారి కూడా అభిమానుల కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? లేక ఈ నవంబర్‌లో ఎలాంటి అప్డేట్ ఉండదా? అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.








