Search
Close this search box.

  సైలెంట్‌గా విశ్వంభర పనులు.. అసలు రిలీజ్ ఎప్పుడంటే..?

November 12, 2026 9:02 AM | Aditya369 News

సైలెంట్‌గా విశ్వంభర పనులు.. అసలు రిలీజ్ ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో సినిమా విడుదలపై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా పనులు సైలెంట్‌గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిత్రబృందం డబ్బింగ్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది. ప్రముఖ నటుడు ప్రవీణ్ ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చాలాకాలంగా ఎలాంటి అప్డేట్ లేకుండా ఉన్న విశ్వంభర సినిమా మళ్లీ కదలికలోకి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే సినిమా పనులు ముందుకు సాగుతున్నప్పటికీ అసలు విడుదల తేదీపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మెగాస్టార్ అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మరి విశ్వంభర ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు