పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓజి’. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంగీత దర్శకుడు థమన్ ఓజి సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దర్శకుడు సుజీత్ ఇప్పటికే ‘ఓజి 2’ స్క్రిప్ట్‌ను అదిరిపోయే రేంజ్లో సిద్ధం చేశారని, ఈ సినిమా ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ అనుభూతిని అందిస్తుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు, కేవలం ఓజి 2 మాత్రమే కాకుండా ఓజి 3 కూడా ఉండబోతుందని చెప్పి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సిరీస్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ, సినీ ప్రయాణంలో ఈ రెండు సినిమాలకు ఎప్పుడు సమయం కేటాయిస్తారనేదే. ఇక ఓజి పార్ట్ 2 విషయానికి వస్తే, ఈ సినిమాను పవన్ కళ్యాణే నిర్మించనున్నట్లు సమాచారం. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ‘బ్లడీ రోమియో’ సినిమాను పూర్తి చేసిన తర్వాత ఓజి 2 పనులను ప్రారంభించే అవకాశం ఉంది.









