సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చర్చకు వస్తుండగా, తాజాగా ఓ క్రేజీ ఫ్యాన్ థియరీ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కుంభ కేవలం ఒక సాధారణ విలన్ కాదని, రామాయణంలో రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడి పునర్జన్మ అయి ఉండవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. అంతేకాదు, రామాయణ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన రావణుడి శక్తివంతమైన నవరత్న మాలను తిరిగి సేకరించడమే కుంభ ప్రధాన లక్ష్యమని ఈ ఫ్యాన్ థియరీ చెబుతోంది. ఈ పని కోసం మహేష్ బాబు పాత్రను ఉపయోగించుకుంటాడనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే ఈ తొమ్మిది రత్నాలు కుంభ చేతికి చిక్కితే అతనికి అపారమైన శక్తులు లభిస్తాయని తెలుసుకున్న రుద్ర, అతని ప్రయత్నాలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడట. ఇందుకోసం టైమ్ ట్రావెల్ ద్వారా రామాయణ కాలానికి వెళ్లే ఆసక్తికరమైన కథాంశం ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఈ ఫ్యాన్ థియరీలోని అంశాలు సినిమాలో నిజమైతే మాత్రం రాజమౌళి మరోసారి ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. భారతీయ పురాణాలు, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ అంశాలను కలిపి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
అయితే ఈ నవరత్న మాల, కుంభకర్ణుడి పునర్జన్మ, టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యాన్ థియరీలు మాత్రమే. మరి ‘వారణాసి’ కథలో అసలు ట్విస్ట్ ఏమిటో తెలియాలంటే సినిమా నుంచి అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









