Search
Close this search box.

  ఎన్టీఆర్ విధ్వంసం..! క్లైమాక్స్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్..!

November 9, 2026 9:24 PM | Aditya369 News

ఎన్టీఆర్ విధ్వంసం..! క్లైమాక్స్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్..!

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభం కావడంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘డ్రాగన్’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌పై అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండటంతో సినిమా పనులు వేగవంతమయ్యాయి. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత మరో పాటను చిత్రీకరించి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో తెలుగు సినిమా కావడంతో ‘డ్రాగన్’పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ మాస్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కుమారస్వామి నేపథ్యంతో ఈ కథ ఉండబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ పాత్రపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

మొత్తానికి ఒకవైపు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ను పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్, మరోవైపు త్రివిక్రమ్ సినిమాతో పాటు భవిష్యత్తులో చేయబోయే భారీ ప్రాజెక్టులతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. మరి ఈ సినిమాల నుంచి అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore