Search
Close this search box.

  బుక్‌మైషోలో ‘రామాయణ’ సునామీ..! పుష్ప 2, ధురంధర్ 2 రికార్డులు బద్దలు..

November 9, 2026 9:23 PM | Aditya369 News

బుక్‌మైషోలో ‘రామాయణ’ సునామీ..! పుష్ప 2, ధురంధర్ 2 రికార్డులు బద్దలు..

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ: పార్ట్ 1’ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మైథలాజికల్ మూవీ టికెట్ బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

నిజానికి విడుదలకు ముందు ‘ధురంధర్ 2’తో పోలిస్తే ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నెమ్మదిగానే ప్రారంభమయ్యాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన స్పందనతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీనికి దీపావళి పండుగ సెలవులు కూడా తోడవడంతో టికెట్ అమ్మకాలు భారీగా పెరిగాయి.

సినిమా విడుదలైన ఐదో రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కేవలం ఒక్క గంటలోనే ఏకంగా 1.10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. 2023 ఆగస్టు నుంచి అందుబాటులో ఉన్న గంటవారీ బుకింగ్స్ ట్రాకింగ్ రికార్డుల్లో ఇదే అత్యధికంగా నిలిచింది. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ‘ధురంధర్ 2’ రికార్డును ‘రామాయణ’ అధిగమించింది.

ఇంతకుముందు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ గంటలో 1.09 లక్షల టికెట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ 1.07 లక్షల టికెట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి ‘రామాయణ’ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, దీపావళి సెలవుల ప్రభావంతో గత రోజుతో పోలిస్తే టికెట్ అమ్మకాలు ఏకంగా 67 శాతం పెరగడం విశేషం. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో ప్రతిరోజూ 10 లక్షలకు పైగా బుక్‌మైషో బుకింగ్స్ సాధించిన ఆరో భారతీయ చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచింది.

ఇక నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపించగా, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

మొత్తానికి విడుదలకు ముందు బుకింగ్స్‌లో కాస్త వెనుకబడిన ‘రామాయణ’.. ఇప్పుడు రికార్డుల వేటలో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore