Search
Close this search box.

  ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీకి విలన్ దొరికేశాడా..?

November 8, 2026 8:20 AM | Aditya369 News

‘ఎల్లమ్మ’లో దేవిశ్రీకి విలన్ దొరికేశాడా..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ కూడా ఒకటి. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ఎల్లమ్మ’లో విలన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్ కోసం నటుడు చైతన్య జొన్నలగడ్డను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు చైతన్య జొన్నలగడ్డ. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో మరోసారి తన నటనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

మరి దేవిశ్రీ ప్రసాద్‌కు చైతన్య జొన్నలగడ్డకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా చైతన్య ఎలాంటి ప్రభావం చూపిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మొత్తానికి ‘ఎల్లమ్మ’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore