మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. హిట్ డైరెక్టర్ కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కాకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే గతంలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట విడుదలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలోని మొదటి పాటను అమెరికాలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక పాట విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, డిసెంబర్లో మాత్రం ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. డిసెంబర్లో మొదటి పాట విడుదల కానుండటంతో, జనవరిలో రావాల్సిన సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మరి మెగాస్టార్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుంది? సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది చూడాలి.









