శ్రీను వైట్ల – శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా జార్జ్ క్రిష్. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో సీనియర్ కన్నడ హీరో రవిచంద్రన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన లుక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందట. రాబోయే షెడ్యూల్లో రవిచంద్రన్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ ఓ జూనియర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర చుట్టూ నడిచే డ్రామా చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు, సినిమాలో ప్రేక్షకులను నవ్వించే ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ కూడా చాలానే ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు, మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. శర్వానంద్, మానస మధ్య లవ్ స్టోరీ కూడా చాలా ట్రెండీగా, ఫన్ఫుల్గా సాగుతుందని సమాచారం.
అన్నట్టు, ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి సైంటిస్ట్ పాత్ర, కొత్త లవ్ స్టోరీ, శ్రీను వైట్ల మార్క్ కామెడీతో జార్జ్ క్రిష్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే!









