మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ.. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి ఓ డిఫరెంట్ జానర్ మూవీ చేయబోతున్నారు.
రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రవితేజ ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ.. పూర్తి స్థాయి కామెడీ హారర్ జానర్‌లో ఆయన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టైటిల్ ఫిక్స్ అయినట్లు, త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియాంక మోహన్ నటించనుండగా, అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రవితేజకు విలన్‌గా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని రంగంలోకి దించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన జేడీ చక్రవర్తి.. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వివేక్ ఆత్రేయ.. జేడీ చక్రవర్తిని కలిసి కథను వివరించినట్లు సమాచారం. ఆయన కూడా ఈ పాత్రపై పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ జేడీ చక్రవర్తి ఈ సినిమాలో విలన్‌గా ఫిక్స్ అయితే.. రవితేజ, జేడీ చక్రవర్తి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుంచి ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే టైటిల్, నటీనటుల విషయంలో ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
మొత్తానికి రవితేజ కామెడీ హారర్ థ్రిల్లర్‌లో కనిపించనుండటం.. అందులోనూ జేడీ చక్రవర్తి విలన్‌గా నటించబోతున్నారనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. మరి ‘తులాభారం’గా వస్తున్న ఈ మూవీతో రవితేజ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.









