Search
Close this search box.

  20 మంది సెలబ్రిటీలు..! అబద్ధాలు, మోసాలు..! తేజ సజ్జా షో ఇదే..!

October 6, 2026 9:28 PM | Aditya369 News

20 మంది సెలబ్రిటీలు..! అబద్ధాలు, మోసాలు..! తేజ సజ్జా షో ఇదే..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు హీరోగా వరుస సినిమాలతో ఆకట్టుకున్న తేజ.. ఇకపై హోస్ట్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘మోసం ఇక్కడ కొత్త రూల్’ అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ షో ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘ది ట్రెయిటర్స్’ ఫార్మాట్‌ను తొలిసారి తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ రియాలిటీ షోలో వివిధ రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు.

వారిలో సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు నటులు హర్షవర్ధన్, ప్రగతి, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుల్లత రామన్, విష్ణు ఓయ్, సాయి రోనక్ వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు.

ఇక ఈ షో గురించి తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’కు హోస్ట్‌గా వ్యవహరించడం తనకు పూర్తిగా కొత్త అనుభవమని తెలిపారు. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు, పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన అనుభవమని, అందుకే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పారు.

అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఫేమస్ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తేజ తెలిపారు.

అయితే ఈ గేమ్‌లో ట్విస్టులు కేవలం కంటెస్టెంట్స్‌కే కాదు.. హోస్ట్‌గా తనకు కూడా అనూహ్యంగానే ఉంటాయని తేజ చెప్పడం ఆసక్తిని పెంచుతోంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయం క్షణాల్లో మారిపోతుందని ఆయన అన్నారు.

అబద్ధాలు, మైండ్ గేమ్స్, నమ్మకద్రోహాలు, ఊహించని పొత్తులతో ఈ గేమ్ సాగుతుందని.. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్టులు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయని తేజ వెల్లడించారు.

మొత్తానికి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు హోస్ట్‌గా ఎలా మెప్పిస్తారనేది ఆసక్తిగా మారింది. అబద్ధాలు, మోసాలు, మైండ్ గేమ్స్‌తో సాగే ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు