Search
Close this search box.

  మెగాస్టార్ కు జోడిగా సీనియర్ ఆ హీరోయిన్..? 27 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో..?

October 6, 2026 9:20 PM | Aditya369 News

మెగాస్టార్ కు జోడిగా సీనియర్ ఆ హీరోయిన్..? 27 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదట సీనియర్ నటి విజయశాంతిని తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఆ పాత్రలో మార్పు జరిగి, విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో చిరంజీవితో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.

ఈ సినిమాలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురి పాత్రలో కనిపించనుంది. కథలో మెగాస్టార్ పాత్రతో పాటు ప్రతి క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ మాస్ బీజీఎంతో పాటు పవర్‌ఫుల్ సాంగ్స్ అందిస్తున్నారు.

ఇక రమ్యకృష్ణ ఎంట్రీ వార్త నిజమైతే మాత్రం ఇది మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి, రమ్యకృష్ణ చివరిసారిగా 1999లో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో కలిసి కనిపించారు. ఇప్పుడు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘కాకా’ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చారన్న వార్తపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం చిరంజీవి–రమ్యకృష్ణ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరగడం ఖాయం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore