Search
Close this search box.

  వాల్తేరు వీరయ్య మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? చిరంజీవి ‘కాకా’పై భారీ అంచనాలు..!

October 1, 2026 6:34 AM | Aditya369 News

వాల్తేరు వీరయ్య మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? చిరంజీవి ‘కాకా’పై భారీ అంచనాలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్.. చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తండ్రీ కూతుళ్ల ట్రాక్‌నే దర్శకుడు బాబీ సినిమాలో ప్రధాన ఎమోషనల్ పాయింట్‌గా తెరకెక్కిస్తున్నట్లు టాక్.
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌నే హైలైట్ చేయనున్న బాబీ!
గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి, రవితేజ మధ్య అన్నదమ్ముల బాండింగ్, ఎమోషన్‌కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు బాబీ. ముఖ్యంగా ఆ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు కీలకంగా నిలిచింది.

అదే తరహాలో ‘కాకా’లో కూడా యాక్షన్‌తో పాటు తండ్రీ కూతుళ్ల అనుబంధం, ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

అంటే.. ఈసారి కూడా బాబీ మాస్ ఎలివేషన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌ను బలంగా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో కనెక్ట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది.

మేకర్స్ ప్లాన్ ప్రకారం ‘కాకా’ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరి ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు