Search
Close this search box.

  ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్..! ‘ఫౌజీ’కి ముందే ‘స్పిరిట్’..!

September 29, 2026 8:04 PM | Aditya369 News

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్..! ‘ఫౌజీ’కి ముందే ‘స్పిరిట్’..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ నుంచి రాబోతున్న ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల విడుదల క్రమం మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మొదట డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఈ రిలీజ్ వాయిదా పడినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’పై కూడా భారీ హైప్ ఉంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 మార్చి 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

‘ఫౌజీ’ వాయిదా పడటంతో.. ప్రభాస్ నుంచి ముందుగా ‘స్పిరిట్’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పెరిగాయని టాక్ వినిపిస్తోంది. ‘స్పిరిట్’ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి ముందుగా రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఆ తర్వాత ‘ఫౌజీ’కి కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ రిలీజ్ ప్లాన్స్‌పై మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ సినిమాల రిలీజ్ క్రమంలో మార్పులు వస్తాయనే ప్రచారం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ముందుగా థియేటర్లలోకి వచ్చేది ‘స్పిరిట్’నా? ‘ఫౌజీ’నా? అనేది అధికారిక ప్రకటనతోనే క్లారిటీ రానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు