నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనుందని, కథలో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్‌లైన్స్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఉండనున్నాయని టాక్. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాకు కీలకంగా ఉండనున్నట్లు సమాచారం.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో బాలయ్య సుమారు 40 నిమిషాల పాటు కనిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇక మోక్షజ్ఞ–వశిష్ఠ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వశిష్ఠ గతంలో ‘బింబిసార’తో విజయాన్ని అందుకోగా.. ‘విశ్వంభర’పై వచ్చిన చర్చ కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తితో పాటు కొన్ని ప్రశ్నలను పెంచింది.
అయితే మోక్షజ్ఞను సాధారణ మాస్ కథతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంపిక చేసినట్లు మరో టాక్ వినిపిస్తోంది.
మరి ఈ సోషియో-ఫాంటసీ కథలో మోక్షజ్ఞను వశిష్ఠ ఎలా చూపించబోతున్నారు? బాలయ్య పాత్ర కథలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించనుంది? అనే విషయాలు తెలియాలంటే మరిన్ని అధికారిక అప్డేట్స్ రావాల్సిందే.








