Search
Close this search box.

  సుకుమార్–దేవిశ్రీ కాంబోకు బ్రేక్..? రామ్ చరణ్ 17పై షాకింగ్ రూమర్..!

September 13, 2026 12:18 AM | Aditya369 News

సుకుమార్–దేవిశ్రీ కాంబోకు బ్రేక్..? రామ్ చరణ్ 17పై షాకింగ్ రూమర్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లో 17వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

సుకుమార్ సినిమాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు దేవిశ్రీ ప్రసాద్. సుకుమార్–దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు ప్రతి సినిమా మ్యూజికల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు వీరి కలయికలో ఒక్క సినిమా కూడా మిస్ కాలేదు.

అయితే ‘పుష్ప 2’ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించనున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇక దేవిశ్రీ ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉండొచ్చనే ప్రచారానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉండటంతో పాటు, ఒకేసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేస్తే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అందుకే రామ్ చరణ్–సుకుమార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మరో సంగీత దర్శకుడిని తీసుకునే అవకాశం ఉందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటివరకు దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి దేవిశ్రీ ఈ సినిమాకు పనిచేస్తారా? లేక సుకుమార్ తన రెగ్యులర్ కాంబినేషన్‌ను బ్రేక్ చేసి మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు