పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కీలకమైన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే త్వరలోనే స్పిరిట్ షూటింగ్ మళ్లీ పునఃప్రారంభం కానున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈసారి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
గతంలో వచ్చినట్టుగా కేవలం ఆడియో గ్లింప్స్ లేదా సౌండ్ స్టోరీ తరహాలో కాకుండా.. ఈసారి నేరుగా ప్రభాస్‌ను హైలైట్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2025లో ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా Spirit నుంచి సౌండ్-స్టోరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను చూపించేలా యాక్షన్‌తో కూడిన గ్లింప్స్ వస్తే.. ఫ్యాన్స్‌కు అది పండగే అని చెప్పాలి.
అసలే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో.. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్‌పై భారీ క్రేజ్ ఉంది.
ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోంది.
మొత్తానికి స్పిరిట్ నుంచి ప్రభాస్ బర్త్‌డే ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకవేళ ఈ యాక్షన్ గ్లింప్స్ నిజంగానే వస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది బర్త్‌డే బ్లాస్ట్ అవ్వడం ఖాయం!









