Search
Close this search box.

  త్రివిక్రమ్ మార్క్ కామెడీతో ‘ఆదర్శ కుటుంబం’ టీజర్..! ఎలా ఉందంటే..

September 13, 2026 12:16 AM | Aditya369 News

త్రివిక్రమ్ మార్క్ కామెడీతో ‘ఆదర్శ కుటుంబం’ టీజర్..! ఎలా ఉందంటే..

తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కూడా ఒకటి. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’.. హౌస్ నెం: 47 లేదా ‘AK 47’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది.

టీజర్ మొదలైనప్పటి నుంచే త్రివిక్రమ్ మార్క్ కామెడీ, డైలాగ్స్ స్పష్టంగా కనిపించాయి. సరికొత్త లుక్‌లో కనిపించిన వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా “డబ్బు సబ్బు లాంటిది రా.. చేతులు కడుక్కోవడానికే పనికొస్తుంది” అంటూ వెంకీ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

అంతేకాదు.. కుటుంబంలో అప్పుల లెక్కలు, వంటింట్లో జరిగే సరదా సంభాషణలు, మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను త్రివిక్రమ్ తన స్టైల్‌లో వినోదాత్మకంగా చూపించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

అయితే టీజర్ అంతా కేవలం కామెడీతోనే నడవదు. కథలో అసలు ట్విస్ట్‌ను చివర్లో రివీల్ చేశారు. కుటుంబం మొత్తం కలిసి ‘AK 47’ అనే పేరున్న డ్యూప్లెక్స్ ఇంట్లోకి మారిన తర్వాత కథ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది.

అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో ఓ క్రైమ్ సంఘటన జరగడం, విలన్ ఎంట్రీ ఇవ్వడంతో టీజర్ ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని.. ఇందులో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని క్లారిటీ వచ్చింది.

అంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్, క్రైమ్‌ను కూడా కలిపి త్రివిక్రమ్ ఓ కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, దివ్యేందు శర్మ, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ముఖ్యంగా కామెడీ నుంచి సీరియస్ టర్న్ తీసుకునే సమయంలో వచ్చే మ్యూజిక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

మొత్తంగా చూస్తే.. వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘AK 47’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఇక ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరి టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్.. థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు