Search
Close this search box.

  ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ..!

September 11, 2026 11:07 PM | Aditya369 News

ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మరోసారి మంచి కమ్‌బ్యాక్ అందించింది. యంగ్ హీరోయిన్ మమితా బైజుతో కలిసి సూర్య నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

ఇప్పటివరకు మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య.. ఈసారి పూర్తిగా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను ఎంచుకున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యాయి.

ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి.. సూర్య తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. దీంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సూర్య కెరీర్‌లో మంచి కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది.

ఇక థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా నేటి నుంచి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పాన్ ఇండియా స్థాయిలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ ఫ్యామిలీ డ్రామాను చూసేయొచ్చు.

ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు