టాలీవుడ్లో దసరా సీజన్కు భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. అక్టోబర్ నెలలో పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
సెప్టెంబర్ 9న రణబాలి టీజర్
సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో సెప్టెంబర్ నుంచే ప్రమోషన్స్ను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రణబాలి టీజర్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు.
సెప్టెంబర్ 9న టీజర్ను విడుదల చేయబోతున్నట్లు ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ ద్వారా వెల్లడించారు. ఈ గ్లింప్స్లో రక్తంతో తడిసిన కత్తిని చూపించడం సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచింది. దీంతో విజయ్ దేవరకొండ ఈసారి మరింత పవర్ఫుల్ యాక్షన్ అవతార్లో కనిపించబోతున్నాడనే అంచనాలు మొదలయ్యాయి.
టీజర్ డబ్బింగ్ పూర్తి చేసిన విజయ్
ఇప్పటికే టీజర్కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కూడా టీజర్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 9న విడుదల కానున్న టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించనుండగా.. రష్మిక జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో రణబాలిపై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన కొన్ని అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
మరి సెప్టెంబర్ 9న విడుదల కానున్న రణబాలి టీజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? విజయ్ దేవరకొండ తన యాక్షన్ అవతార్తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడు? అక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.









