నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించినప్పటికీ.. షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ఇప్పటికే సెప్టెంబర్ 24, 2026న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
రిలీజ్‌పై సోషల్ మీడియాలో ప్రచారం
ఇటీవల రెండు రోజులుగా ది ప్యారడైజ్ విడుదల వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నాని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 24నే ది ప్యారడైజ్!
తాజాగా ఈ వార్తలకు చిత్ర నిర్మాణ సంస్థ SLV Cinemas చెక్ పెట్టింది. తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది.
ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని.. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు.
దీంతో నాని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.









