Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్..! ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్..!

September 2, 2026 10:38 PM | Aditya369 News

పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్..! ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్..!

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు OG యూనివర్స్ నుంచి అదిరిపోయే స్పెషల్ ట్రీట్ వచ్చింది. పవన్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు దర్శకుడు సుజీత్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ OG యూనివర్స్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
OG యూనివర్స్‌లో కొత్త ప్రపంచం!
ఈ స్పెషల్ వీడియోలో OG ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ఆసక్తికరమైన విజువల్స్‌ను చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మధ్య జరుగుతున్న చర్చలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

“మన బ్లడ్ గ్రూప్ OG సార్” అంటూ తమన్ చెప్పడం.. దానికి సుజీత్ “యూనివర్సల్ బ్లడ్ గ్రూప్” అంటూ చెప్పడం అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది.

అంతేకాదు.. “మీరేం చేస్తారో తెలియదు.. ఈ సినిమాతో ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వాలి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి నేటి కాలం వరకు!
ఈ వీడియో ద్వారా OG యూనివర్స్ కథ మరింత విస్తృతంగా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు మేకర్స్. ఆజాద్ హింద్ ఫౌజ్ కాలం నుంచి నేటి కాలం వరకు జరిగిన కొన్ని సంఘటనలతో ఈ యూనివర్స్‌ను కనెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ పోషించిన ఓజాస్ గంభీర పాత్ర చుట్టూ కథ మరింత విస్తరించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో OG యూనివర్స్‌లోకి మరిన్ని పాత్రలు, కొత్త కథాంశాలు వచ్చే అవకాశం ఉందనే ఆసక్తి మొదలైంది.

ప్రముఖ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ OG యూనివర్స్ స్పెషల్ ట్రీట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇవ్వడంతో పాటు.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు