సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం కామన్. ప్రస్తుతం అలాంటి క్రేజీ సీక్వెల్స్‌లో లక్కీ భాస్కర్ 2 కూడా చేరిపోయింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భాస్కర్ పాత్రలో దుల్కర్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
త్వరలోనే లక్కీ భాస్కర్ 2!
ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి దీనిపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐయామ్ గేమ్’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని, ఈ విషయంలో తాను ప్రామిస్ చేస్తున్నానని తెలిపారు.
మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా సీక్వెల్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక లక్కీ భాస్కర్ 2 పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఎక్కడికి వెళ్లినా భాస్కర్ అనే పిలుస్తున్నారు!
లక్కీ భాస్కర్ సినిమా తనపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో దుల్కర్ ఆసక్తికరంగా వెల్లడించారు. సినిమా తర్వాత తాను బంగ్లాదేశ్, జపాన్, టిబెట్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రేక్షకులు తనను గుర్తుపట్టి.. వెంటనే ఫోన్‌లో లక్కీ భాస్కర్ గురించి సెర్చ్ చేసి, “భాస్కర్ మీరే కదా?” అంటూ అడుగుతున్నారని తెలిపారు.
దీంతో లక్కీ భాస్కర్ పాత్ర తనకు ఎంతటి గుర్తింపును తీసుకొచ్చిందో అర్థమవుతోంది.
ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ 2 మరింత భారీగా, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం దుల్కర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









